Kadiyam Kavya: భారాసకు షాక్‌.. వరంగల్‌ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య

Kadiyam Kavya: పోటీనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన డాక్టర్ కడియం కావ్య

Shashank Gullapelli
Published on: 29 March 2024 7:56 AM IST
Big Shock For BRS In Warangal
X

Kadiyam Kavya: భారాసకు షాక్‌.. వరంగల్‌ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య

Kadiyam Kavya: వరంగల్ లోక్ సభ స్థానంనుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీనుంచి తప్పుకుంటున్నట్లు డాక్టర్ కడియం కావ్య ప్రకటించారు. బీఆర్ఎస్ పట్ల ఇటీవల భూ కబ్జా, అవినీతి, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో పార్టీ ప్రతిష్ట దిగజారిందని బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ కు ఆమె లేఖ రాశారు. జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల మధ్య సమన్వయంలేమితో పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని పేర్కొన్నారు. వరంగల్ లోక్ సభ స్థానానికి బీఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పటి పరిస్థితులతో పోటీనుంచి తప్పుకుంటున్నందుకు క్షమించాలని కేసీఆర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు మన్నించాలని డాక్టర్ కడియం కావ్య లేఖలో పేర్కొన్నారు.

ఇది ఇలా ఉండగా... బీఆర్ఎస్ పార్టీనుంచి వరంగల్ టిక్కెట్ ఖరారైన తర్వాత గౌరవ ప్రదంగా పోటీనుంచి తప్పుకున్న డాక్టర్ కడియం కావ్య, తండ్రి కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మార్గం సుగమమైందని సమాచారం. ఈనెల 31 తేదీన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువాను కప్పుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే.. తండ్రి కడియం శ్రీహరితో కలిసి ఢిల్లీ పయనమైనట్లు సమాచారం.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story