బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ముగిసిన అఖిలప్రియ విచారణ.. కీలక విషయాలు..

Bhuma Akhil Priya Police Custody Completed in Bowenpally Kidnap Case
x
Highlights

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ కస్టడీ పిటిషన్‌ నిన్నటితో ముగిసింది. మూడు రోజుల పాటు అఖిలప్రియను ప్రశ్నించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు అఖిలప్రియకు...

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ కస్టడీ పిటిషన్‌ నిన్నటితో ముగిసింది. మూడు రోజుల పాటు అఖిలప్రియను ప్రశ్నించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు అఖిలప్రియకు వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్‌ ముందు అఖిలప్రియను హాజరుపర్చనున్నారు. మధ్యాహ్నం చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. కస్టడీ విచారణలో పోలీసులు కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం. భర్త భార్గవ్‌రామ్‌ పాత్రతో పాటు అఖిలప్రియ పాత్ర, కిడ్నాప్‌పై క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. అఖిప్రియ నుంచి ఇప్పటికే స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories