అఖిలప్రియను గాంధీకి తరలించే విషయంలో పోలీసుల హైడ్రామా

Arun Chilukuri
Published on: 14 Jan 2021 1:41 PM IST
Bhuma Akhil Priya Police Custody Completed
X

అఖిలప్రియకు వైద్య పరీక్షల చేయించే క్రమంలో పోలీసులు హైడ్రామా క్రియేట్‌ చేశారు. మీడియా దృష్టి మరల్చడానికి మరోసారి అఖిలప్రియను బేగంపేట్‌లోని పాటిగడ్డ ప్రైమరీ హెల్త్‌కేర్‌ సెంటర్‌కు తరలించారు. కరోనా పరీక్షల అనంతరం ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు.

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ కస్టడీ పిటిషన్‌ ముగిసింది. మూడు రోజుల పాటు అఖిలప్రియను ప్రశ్నించారు. గాంధీ ఆస్పత్రిలో అఖిలప్రియకు వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చనున్నారు. మధ్యాహ్నం చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. కస్టడీ విచారణలో పోలీసులు కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం. భర్త భార్గవ్‌రామ్‌ పాత్రతో పాటు అఖిలప్రియ పాత్ర, కిడ్నాప్‌పై క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. అఖిప్రియ నుంచి ఇప్పటికే స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు పోలీసులు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story