Top
logo

తెలంగాణా పీసీసీ పంచాయతీ తేలేనా?

తెలంగాణా పీసీసీ పంచాయతీ తేలేనా?
Highlights

తెలంగాణ లో కొత్త పీసీసీ చీఫ్ నియామకానికి ముహూర్తం ఖరారైందా అధ్యక్ష నియామకంపై తేదీలు వాయిదాల మీద వాయిదాలు వేయడం ...

తెలంగాణ లో కొత్త పీసీసీ చీఫ్ నియామకానికి ముహూర్తం ఖరారైందా అధ్యక్ష నియామకంపై తేదీలు వాయిదాల మీద వాయిదాలు వేయడం వెనక అధిష్టానం ఆలోచన ఏంటి? ఇంతకీ పీసీసీ చీఫ్ గా ఎవరికి అవకాశాలు ఉన్నాయి? కోమటిరెడ్డి వెంకట రెడ్డికి ఏమేరకు అదృష్టం కలిసొస్తుంది? రేవంత్ రెడ్డి లాబీయింగ్ ఫలిస్తుందా? వాచ్ దిస్ స్టోరీ?

తెలంగాణలో కాంగ్రెస్ కి కొత్త చీఫ్ రావడం అన్నది పక్కా. కానీ ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇదిగో అదిగో అంటూ నెలలు గడిచిపోతున్నాయి. పీసీసీ గా కొనసాగడానికి ఉత్తమ్ కుమార్ సుముఖంగా లేకపోవడంతో కొత్త చీఫ్ నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం కూడా దృష్టి పెట్టింది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే పీసీసీ పదవిని భర్తీ చేస్తారని ప్రచారం సాగింది. కానీ కరోనా రాకతో ఈ వ్యవహారం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా పీసీసీ అధ్యక్షుడు అయిదేళ్ల పాటూ ఒకరే ఉన్నది లేదు దీంతో పీసీసీ మార్పు ఖాయంగా కనిపిస్తోంది.

అయితే ప్రస్తుతానికి తెలంగాణా పీసీసీ చీఫ్ గా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్టు ఏఐసీసీ వర్గాల నుంచి సమాచారం. దసరా-దీపావళి నాటికి తెలంగాణా పీసీసీ పునర్వ్యవస్థీకరణ పూర్తి చేయాలని అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా మహమ్మారి రాక పోయి ఉంటే ఈపాటికేఈ నియామకం పూర్తయ్యేది అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి కున్న అర్హతలపై సోనియాగాంధీ సంతృప్తి వ్యక్తం చేశారని, ఆయన నాయకత్వంపై సానుకూలంగా స్పందించారని అంటున్నారు.

పీసీసీ అధ్యక్ష పదవికి ఐదుగురు సీరియస్ గా పోటీపడుతున్నా అత్యంత నిబద్ధత కలిగిన నేతగా కోమటిరెడ్డి వైపే సోనియా, రాహుల్ లు మొగ్గు చూపిస్తున్నట్టు సమాచారం. మొదటినుంచి కాంగ్రెస్ వ్యక్తి కావడం, nsui, యూత్ కాంగ్రెస్ నుంచి పార్టీ లో పనిచేయడం కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి కలిసొచ్చే విషయంగా చెబుతున్నారు. పీసీసీ అధ్యక్ష పదవికి కోమటిరెడ్డి కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

పీసీసీ అధ్యక్ష పదవికి మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డిల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే జీవన్ రెడ్డి మాత్రం అధిష్టానం పిలిచి అప్పగిస్తే తప్ప తనకు తాను అభ్యర్థించబోనని చెప్పినట్టు తెలుస్తోంది. సీనియర్ నేత వి.హన్మంతరావు ఆసక్తి కనబరుస్తున్నా ఆయన పేరు పరిశీలనలో లేదని అంటున్నారు.

అధ్యక్ష పదవిని దక్కించుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి భారీ ఎత్తున లాబీయింగ్ చేస్తున్నా ఆయనకు కొన్ని ప్రతికూలతలు అడ్డు వస్తున్నాయి. చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు , కేసులు కూడా ఆయనకు మైనస్ గా మారాయి అనే టాక్ వినిపిస్తోంది. రేవంత్ కి ఇస్తే పార్టీలో సీనియర్లు తిరుగుబాటు చేస్తారనే భావన కూడా ఉంది. మరో సీనియర్ నేత కె.జానారెడ్డి పట్ల కాంగ్రెస్ హై కమాండ్ సానుకూలంగా ఉన్నా వయసు రీత్యా ఆయన ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కు కేంద్ర పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి.

Web TitleBhongir MP Komatireddy likely to be next TPCC chief
Next Story