Bhatti Vikramarka: ఆరుగ్యారంటీలు అమలుచేయడానికి.. రాష్ట్రంలో పుష్కలంగా ఆర్థిక సంపద ఉంది

Bhatti Vikramarka: భయపెట్టి ఓట్లు వేయించుకునే పరిస్థితి తెలంగాణలో లేదు

Shekhar G
Published on: 6 Nov 2023 1:56 PM IST
Bhatti Vikramarka Sensational Comments On Brs Manifesto
X

Bhatti Vikramarka: ఆరుగ్యారంటీలు అమలుచేయడానికి.. రాష్ట్రంలో పుష్కలంగా ఆర్థిక సంపద ఉంది

Bhatti Vikramarka: కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి రాష్ట్రంలో పుష్కలంగా ఆర్థిక సంపద ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంజిల్లా రామన్నపాలెం, ఎర్రుపాలెం మండలం, మధిర నియోజకవర్గంలో భట్టి ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. బీఆర్ఎస్ కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు బందు చేస్తామని.. భయపెట్టి ఓట్లు వేయించుకునే పరిస్థితి తెలంగాణలో లేదన్నారు. దొరల ప్రభుత్వానికి చరమగీతం పాడి కాంగ్రెస్ ప్రజల ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. ప్రజల సంపదని దోపిడి చేసి అత్యంత అవినీతిపరులుగా మారిన బీఆర్ఎస్ పాలకులు అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలకుల అవినీతి దోపిడి వల్లనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సంపద ప్రజలందరికి పంచాలన్న రాహుల్ ఆకాంక్షలు నెరవేరుస్తామన్నారు. ప్రజల సంపద ప్రజలకు చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు అధికారంలోకి తెచ్చుకోవాలన్నారు.

Shekhar G

Shekhar G

Next Story