Bhatti Vikramarka: రేవంత్‌ సీఎం అంటూ మల్లు రవి వ్యాఖ్యలపై భట్టి స్పందన

Bhatti Vikramarka Reacted to Mallu Ravi Comments Saying Revanth is CM
x

Bhatti Vikramarka: రేవంత్‌ సీఎం అంటూ మల్లు రవి వ్యాఖ్యలపై భట్టి స్పందన

Highlights

Bhatti Vikramarka: సీఎం ఎవరవుతారో ముందె చెప్పడం సరికాదు

Bhatti Vikramarka: రేవంత్‌ సీఎం అంటూ మల్లు రవి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు భట్టి విక్రమార్క. సీఎం ఎవరవుతారో ముందే చెప్పడం సరికాదన్న భట్టి.. ఎలాంటి ప్రక్రియ జరగకుండా సీఎం అభ్యర్థి ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికలయ్యాక సీఎల్పీ సమావేశం అవుతుందని, ఆ సమావేశంలో అగ్రనేతలు అందరి అభిప్రాయాలు తీసుకుంటారని చెప్పారు. ఆ తర్వాత సీఎల్పీ లీడర్‌ను ఎన్నుకుని పార్టీ పరంగా గవర్నర్‌కు లేఖ రాస్తామన్నారు. ఇవేవీ జరగకుండా సీఎం అభ్యర్థి ప్రకటన కరెక్ట్‌ కాదన్నారు భట్టి.

Show Full Article
Print Article
Next Story
More Stories