చింతకానికి చేరుకున్న భట్టి పాదయాత్ర.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతకానితనంతోనే...

Bhatti Vikramarka: దళితబంధు పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు.. దళారులు, బ్రోకర్లు, మోసగాళ్ల తాటతీస్తాం -భట్టి

Shireesha
Updated on: 26 March 2022 1:00 PM IST
Bhatti Vikramarka Reached Chintakani by Padayatra | Congress Latest News
X

చింతకానికి చేరుకున్న భట్టి పాదయాత్ర.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతకానితనంతోనే...

Bhatti Vikramarka: దళితబంధు పేరుతో లబ్దిదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, అలాంటి దళారులు, బ్రోకర్లు, మోసగాళ్ల తాటతీస్తామని హెచ్చరించారు సీఎల్పీ నేత భట్టి. చింతకానిలో ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు పథకం డబ్బులు ఇప్పించే బాధ్యత తనదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతకానితనంతోనే నిత్యవసర ధరలు మండిపోతున్నాయని ఆయన ఫైర్‌ అయ్యారు. మోడీ పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచి ప్రజలపై భారం మోపి నడ్డి విరుస్తుంటే.. సీఎం కేసీఆర్‌ కరెంట్‌ చార్జీలు పెంచి సామాన్యుడిపై భారం మోపుతున్నారని విమర్శించారు భట్టి. ఈ పాదయాత్రకు టీడీపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు.

Shireesha

Shireesha

Next Story