Bhatti Vikramarka: బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర సంపదను దోచుకున్నారు

Bhatti Vikramarka: కాంగ్రెస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు

Shekhar G
Published on: 19 Nov 2023 5:39 PM IST
Bhatti Vikramarka Comments On BRS Leaders
X

Bhatti Vikramarka: బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర సంపదను దోచుకున్నారు

Bhatti Vikramarka: దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ఎన్నికల్లో దొరలు ఓడి ప్రజలు గెలవాని మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క అన్నారు. మధిర నియోజకవర్గం బోనకల్ మండలంలోని పలు గ్రామాల్లో భట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అద్భుత ప్రాజెక్ట్ అని గొప్పలు చెప్పుకున్న కాళేశ్వరం కుంగుబాటుపై బీఆర్ఎస్ నేతలెవరూ నోరు విప్పడం లేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం నిర్మాణం పేరిట లక్ష కోట్లు దోపిడీ చేశారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదన్నభట్టి.. కేసీఆర్ కుటుంబ సభ్యులు బాగుపడ్డారని తెలిపారు. బీజేపీ,బీఆర్ఎస్, ఎంఐఎంలు కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు.

Shekhar G

Shekhar G

Next Story