Bhatti Vikramarka: మాది దొరల ప్రభుత్వం కాదు.. మాది ప్రజల ప్రభుత్వం

Bhatti Vikramarka: ప్రజల చేతనే ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం మాది

Jyothi
Published on: 28 Dec 2023 11:19 AM IST
Bhatti Vikramarka Comments at Praja Palana Program
X

Bhatti Vikramarka: మాది దొరల ప్రభుత్వం కాదు.. మాది ప్రజల ప్రభుత్వం 

Bhatti Vikramarka: మాది ప్రజల ప్రభుత్వమని.. దొరల ప్రభుత్వం కాదన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల దగ్గరకే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో మహిళలు వారి సమస్యలు చెప్పుకున్నారని, ప్రజల చేత ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం తమదని అన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో ఒక రేషన్ కార్డుకు దరఖాస్తు కూడా తీసుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన అందిస్తామని అన్నారు. తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజల సమక్షంలో అమలు చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. పదేళ్లలో రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు పొందలేదన్నారు. ప్రజల దగ్గరకు వెళ్లి ఆరు గ్యారెంటీలు అమలు చేయడమే ప్రజాపాలన కార్యక్రమం ఉద్దేశమన్నారు భట్టి.

Jyothi

Jyothi

Next Story