BEL Notification 2020: హైదరాబాద్‌లో 64 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

BEL Notification 2020: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన (బెల్)భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.

S. Srikanth
Published on: 3 Sept 2020 1:48 PM IST
BEL Notification 2020: హైదరాబాద్‌లో 64 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
X

BEL Notification 2020: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన (బెల్)భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారు హైదరాబాద్ యూనిట్ లో కాంట్రాక్టు పద్దతిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 64 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. వీటిలో ట్రెయినీ ఆఫీసర్‌, ట్రెయినీ ఇంజనీర్‌, ప్రాజెక్ట్ ఆఫీస‌ర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ వంటి పోస్టులున్నాయి.

ద‌ర‌ఖాస్తు చేసిన అభ్యర్ధులను ఇంటర్వ్యూ, అకడమిక్‌ మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్ధులు అధికార వెబ్ సైట్ https://www.bel-india.in/ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 22 దరఖాస్తుకు చివరితేదిగా నిర్ణయించారు.

మొత్తం ఖాళీలు: 64

* ట్రెయినీ ఇంజినీర్‌-33

* ప్రాజెక్ట్ ఇంజినీర్‌-28

* ట్రెయినీ ఆఫీస‌ర్-02

* ప్రాజెక్ట్ ఆఫీస‌ర్-01

ముఖ్య సమాచారం:

* ఉద్యోగ విభాగాలు: ఎల‌క్ట్రానిక్స్‌, మెకానిక‌ల్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఫైనాన్స్‌, హ్యూమ‌న్ రిసోర్స్‌ (హెచ్‌ఆర్‌) తదితర విభాగాలున్నాయి.

* ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మార్కులు, ఎక్స్పీరియన్స్ , ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్‌), ఎంబీఏ(ఫైనాన్స్‌), ఎంబీఏ/ ఎంఎస్‌డ‌బ్ల్యూ/ ఎహెచ్ఆర్ఎం(హెచ్ఆర్‌) ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం తప్పనిసరి.

ముఖ్య తేదీలు..

* ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 22 సెప్టెంబర్‌ 2020

ద‌ర‌ఖాస్తు విధానం:

* ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

పంపవలిసిన చిరునామా: Dy. General Manager (HR),

Bharat Electronics Limited,

I.E.Nacharam,

Hyderabad - 500076,

Telangana State.

నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలకోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..

S. Srikanth

S. Srikanth

Next Story