Kasireddy Narayan Reddy: బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కసిరెడ్డి.. రేవంత్ తో భేటీ

Kasireddy Narayan Reddy: బీఆర్ఎస్ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేసిన కసిరెడ్డి

Shekhar G
Published on: 1 Oct 2023 12:43 PM IST
Bharasa MLC Kasireddy Narayan Reddy Resigns
X

Kasireddy Narayan Reddy: బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కసిరెడ్డి.. రేవంత్ తో భేటీ

Kasireddy Narayan Reddy: తెలంగాణలో అధికార పార్టీకి షాక్‌ తగిలింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. కల్వకుర్తి టికెట్‌ ఆశించి భంగపడ్డ కసిరెడ్డి.. పార్టీతో పాటు బీఆర్‌ఎస్‌ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. ఇవాళ ఉదయం రేవంత్‌రెడ్డితో కసిరెడ్డి భేటీ అయ్యారు. ఈ ఇరువురి మధ్య చాలాసేపు చర్చలు జరిగాయి. అనంతరం.. తాను బీఆర్‌ఎస్‌ పార్టీని వీడుతున్నట్టు వెల్లడించారు కసిరెడ్డి. తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపినట్టు తెలుస్తోంది. కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు.. జడ్పీ వైస్‌ చైర్మన్‌ బాలాజీ కూడా బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు.

Shekhar G

Shekhar G

Next Story