Bhadrachalam: భద్రాచలంలో భారీ వర్షం.. రామాలయం చుట్టూ వరదనీరు

రామాలయం ప్రాంతంలోకి భారీగా వరద నీరు చేరి అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్స్ పూర్తిగా జలమయమయ్యింది. దీంతో తెల్లవారుజామునుంచి భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 Aug 2024 11:57 AM IST
Bhadrachalam Temple Water floods
X

Bhadrachalam: భద్రాచలంలో భారీ వర్షం.. రామాలయం చుట్టూ వరదనీరు

Bhadrachalam: భద్రాచలం ప్రాంతంలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీ, అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీలలో పలు ఇళ్లు నీటమునిగాయి. రామాలయం ప్రాంతంలోకి భారీగా వరద నీరు చేరి అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్స్ పూర్తిగా జలమయమయ్యింది. దీంతో తెల్లవారుజామునుంచి భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

పంచాయతీ కార్యాలయం ప్రాంతంలో నీరు రోడ్ల పైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో పాటు దుమ్ముగూడెం, చర్ల మండాలలోని పలు చోట్ల వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తుండటంతో పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాత్రి నుండి పలు గ్రామాలకి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story