అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు.. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ముత్యాల తలంబ్రాలు

Ayodhya: రథానికి ప్రత్యేక పూజలు, హారతులతో స్వాగతం

Shekhar G
Updated on: 20 Jan 2024 6:31 PM IST
Bhadrachalam Sri Sita Ramachandra Swamy  Talambralu For Ayodhya Ram Mandir Pran Prathista
X

అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు.. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ముత్యాల తలంబ్రాలు

Ayodhya: అయోధ్యలోని శ్రీ రామ మందిర ప్రాణ ప్రతిష్టకు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ముత్యాల తలంబ్రాల కానుక రథం శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో పాటు హిందూ సంఘాల నాయకులు రథానికి ఘన స్వాగతం పలికారు. ముత్యాల తలంబ్రాల కలశాన్ని ఎమ్మెల్యే తలపై ఎత్తుకొని స్థానిక శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం వరకు తీసుకెళ్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు హారతులతో స్వాగతం పలికారు. జనవరి 22న అయోధ్యలో శ్రీ రామ మందిర ప్రాణ ప్రతిష్ట ఉంది, కాబట్టి ఆ రోజున తెలంగాణ రాష్ట్రం మొత్తం అధికారికంగా సెలవు ప్రకటించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story