Hyderabad: హైదరాబాద్‌లో నయా జూదం

Hyderabad: మేకపోతుల పోటీలు పెట్టిన బడాబాబులు * ముద్దుపేర్లు పెట్టుకుని బెట్టింగ్

Sandeep Eggoju
Updated on: 10 April 2021 1:03 PM IST
Betting on Goats Competition in Hyderabad
X

goats (file image)

Hyderabad: ఐపీఎల్ బెట్టింగ్‌లు, కోడి పందాలు, పేకాట పందాలు బోర్ కట్టినట్టున్నాయ్ ఇప్పుడు హైదరాబాద్‌లో మరో నయా జూదానికి తెర లేపారు మేకపోతుల పోటీలు పెట్టి బెట్టింగ్ కాస్తున్నారు. వీరా, మల్లిక్ పేరుతో బెట్టింగ్ కాస్తున్నారు. గతకొంత కాలంగా గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు పెట్టి మేకపోతుల పోటీలు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్ల వయసున్న వీర, మల్లిక్‌లను భారీ పెట్టబడితో పోషిస్తున్నారు. వేల రూపాయలు బెట్టింగ్ నిర్వహిస్తున్ 11 మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 69 వేలు, రెండు మేకపోతులను స్వాధీనం చేసుకున్నారు.

హకీంబాబా దర్గాకు చెందిన మెహరాజ్ పన్ రెండు మేకపోతులను పెంచుతున్నాడు. వాటి మధ్య పోటీ పెట్టి బెట్టింగ్ మొదలు పెట్టాడు. అవి కొమ్ములు ఢీ కొట్టినప్పుడల్లా బెట్టింగ్ డబ్బు అధికం చేస్తూ వేల రూపాయలు వసూలు చేసేవాడు. ఇందుకోసం ప్రత్యేకంగా చిన్న మైదానాన్ని సిద్ధం చేశాడు. గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఈ పోటీలపై టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించి 11 మంది బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాట్టు తెలుస్తోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story