బేగంబజార్ నీరజ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు.. అవమానభారంతోనే హత్య...

Begum Bazar Neeraj Honour Killing Accused Remand Report | Live News Today
x

బేగంబజార్ నీరజ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు.. అవమానభారంతోనే హత్య...

Highlights

Begum Bazar Neeraj Assassination: బేగంబజార్ రావద్దని హెచ్చరించిన సంజన తల్లి...

Begum Bazar Neeraj Assassination: నీరజ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అవమానభారంతోనే నీరజ్‌ను హత్య చేసినట్లు విచారణలో నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు. పెళ్లి అయ్యాక.. యాదవ్ సమాజ్‌కు చెందిన వ్యక్తులతో, నీరజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు నిందితులు చెప్పారని పోలీసులు తెలిపారు.

ఇక బాబు పుట్టిన తర్వాత తల్లితో సంజన మాట్లాడిందని.. ఈ క్రమంలోనే సంజనను తన తల్లి బేగంబజార్‌కు రావొద్దని హెచ్చరించినట్లు సమాచారం. అయితే తల్లి హెచ్చరికను లెక్క చేయకుండా బేగంబజార్‌లో ఉంటున్న నీరజ్‌ను ఎలాగైన హత్య చేయాలని నిందితులు ప్లాన్ చేసుకున్నారని.. అందుకు జుమేరాత్‌ బజార్‌లో కత్తులు, రాడ్లు కొన్నట్లు తెలుస్తుంది. బైక్‌పై వెళ్తున్న నీరజ్‌ కంట్లో కారం చల్లి కత్తులతో దాడి చేసి చంపినట్లు విచారణలో వెల్లడైందన్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories