R Krishnaiah: కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల చిన్న చూపు చూస్తోంది

R Krishnaiah: చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్ కల్పించాలని వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు.

Arun Chilukuri
Updated on: 16 Jun 2023 8:15 PM IST
BCs Should be Given 50 Percent Reservation in the Legislature Says R Krishnaiah
X

R Krishnaiah: కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల చిన్న చూపు చూస్తోంది

R Krishnaiah: చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్ కల్పించాలని వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీలను చిన్న చూపు చూస్తుందని దుయ్యబట్టారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీల కోసం మద్దతు తెలిపినా.. కేంద్రం తీరులో మార్పు రావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం జనాభా పరంగా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. 75 కోట్ల మంది బీసీల అభివృద్ధి కేంద్రం ఏం చేస్తుందని ప్రశ్నించారు. రెండు లక్షల కోట్లు బడ్జెట్ బీసీలకు ఇవ్వకపోతే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ధర్నాలు చేస్తామన్నారు. 75 ఏళ్ళుగా భారతదేశంలో అన్ని పదవులు, సంక్షేమ పథకాలు తమరే అనుభవించారని.. బీసీలకు మాత్రం ఏం దక్కడం లేదని విమర్శించారు. బీసీ సంఘాలన్నీ కలిసికట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాల్లో పర్యటించి బీసీలను ఏకం చేస్తామన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story