Bathukamma Sarees 2022: రేపటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ..

Bathukamma Sarees Distribution From Tomorrow
x

Bathukamma Sarees 2022: రేపటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ..

Highlights

Bathukamma Sarees 2022: తెలంగాణ అడబిడ్డలు గొప్పగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ.

Bathukamma Sarees 2022: తెలంగాణ అడబిడ్డలు గొప్పగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండుగను మహిళలు ఆత్మగౌరవంతో జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చీరలను పంపిణీ చేస్తోంది. ఈ నెల 25వ తేదీ నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానుండగా రేపటి నుంచే అంటే ఈ నెల 22వ తేదీ నుంచే బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టనున్నట్టు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నేతన్నలకు చేయూతనివ్వడంతోపాటు, ఆడబిడ్డలకు ప్రేమపూర్వక చిరుకానుక ఇవ్వాలన్న ఉధాత్తమైన ఉభయతారక లక్ష్యంతో కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించినట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని జిల్లాల కలెకర్లతో సమన్వయం చేసుకుంటూ, తమ టెక్స్‌టైల్‌ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. ఈ సంవత్సరం (24) విభిన్న డిజైన్లు (10) రకాల ఆకర్షణీయమైన రంగులలో మొత్తం (240) రకాల త్రెడ్ బోర్డర్ (దారపు పోగుల అంచుల) తో చీరలు సిద్ధం చేశారు. 92.00 లక్షల రెగ్యులర్ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో వయోవృద్ధ మహిళలు ధరించే 9.00 మీటర్లు పొడవు గల 8 లక్షల చీరలు సిద్ధం చేశారు.




Show Full Article
Print Article
Next Story
More Stories