Sircilla: బతుకమ్మ చీరలకు వరద కష్టాలు

* సిరిసిల్ల వరదలకు నీట మునిగిన నేతన్నల మగ్గాలు * కాలిపోయిన మర మగ్గాల మోటార్లు బతుకమ్మ చీరలకు వరద బురద

Arun Chilukuri
Updated on: 16 Sept 2021 4:39 PM IST
Due to Heavy Rains in Sircilla all Batukamma Sarees are Damaged
X

సిరిసిల్ల వరదలు (ఫోటో-ది న్స్ ఇండియా)

Sircilla: సిరిసిల్ల లో గతవారం వరద ఉథృతి నేతన్నలకు భారీ నష్టాలను మూటగట్టింది. ఒకవైపు బతుకమ్మ చీరలు, వాటి ముడి సరకులు తడిసి ముద్దవగా, మరో వైపున మరమగ్గాల మోటర్లు కాలిపోయి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఇప్పటికే ఉత్పత్తి అయిన చీరలు, చీరల కోసం తెచ్చిన నూలు తడిసి ముద్దవగా, మరమగ్గాల మోటర్లు కాలిపోయి నేతన్నలకు లక్షల్లో నష్టం వాటిల్లింది. కొన్ని చోట్ల పరిశ్రమలు, డయింగ్ పరిశ్రమల గోడలు కూడా కూలిపోయాయి.

ఏ చిన్నపాటి వర్షం పడిన లోతట్టు ప్రాంతాలలో మళ్ళీ వరద వస్తుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. బతుకమ్మ చీరలతో పాటుగా, ముడి సరుకులు కూడా తడిసి బురద మొత్తం వాటికి అంటుకొనిపోయింది. వీటన్నిటికి తోడు చెత్తా చెదారం కూడా తోడవడంతో, వాటిని శుభ్రం చేయడం ఇబ్బందిగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story