నేడు రాత్రి బుర్జ్‌ ఖలిఫాపై బతుకమ్మ సంబురం.. దుబాయ్‌ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత

Bathukamma Festival to be Screened on Burj Khalifa
x

నేడు రాత్రి బుర్జ్‌ ఖలిఫాపై బతుకమ్మ సంబురం.. దుబాయ్‌ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత

Highlights

Bathukamma: ఇవాళ రాత్రికి దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శనను నిర్వహించనున్నారు.

Bathukamma: ఇవాళ రాత్రికి దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శనను నిర్వహించనున్నారు. ప్రపంచంలోనే ఎత్తయిన దుబాయ్‌లోని బుర్జ్‌ఖలీఫాపై ఈరోజు రాత్రి 9.40 నిమిషాలకు, 10.40 నిమిషాలకు బతుకమ్మ వీడియో ప్రదర్శించనున్నారు. మూడేసి నిమిషాల నిడివిగల ఈ వీడియోల్లో తెలంగాణలో బతుకమ్మ ప్రాశస్త్యం, విశిష్టత, సంబురాల సంస్కృతిని తెలియజేస్తారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎంపీ సురేశ్‌ రెడ్డి పలువురు నేతలు దుబాయ్‌కి చేరుకున్నారు. దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో వీరికి తెలంగాణ జాగృతి ప్రతినిధులు, టీఆర్ఎస్‌ నాయకులతోపాటు ప్రవాస తెలంగాణ బిడ్డలు ఘనస్వాగతం పలికారు. దుబాయ్‌ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories