బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన

Basara IIIT: విద్యార్థులను చర్చలకు ఆహ్వానించిన ఇంఛార్జ్ వీసీ

Jyothi
Updated on: 31 July 2022 1:58 PM IST
Basara IIIT Students Protest
X

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. విద్యార్థులు మళ్లీ ఆందోళనకు దిగారు. ఫుడ్‌ పాయిజన్‌కు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భోజనశాలకు లైసెన్స్‌ను వెంటనే రద్దు చేసి కొత్త వారిని నియమించాలని శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేరుస్తామని ఇచ్చిన హామీలను పక్కనపెట్టటంతో శనివారం రాత్రి భోజనం చేసేందుకు వెళ్లిన విద్యార్థులందరూ అన్నం తినకుండా నిరసన వ‍్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించేంతవరకు భోజనం చేయబోమని భీష్మించుకు కూర్చున్నారు. రాత్రంతా మెస్‌లోనే జాగారం చేశారు. ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. మరోవైపు నేడు ట్రిపుల్‌ ఐటీ సందర్శించనున్నారు ఎంపీ సోయం బాపూరావు.


Jyothi

Jyothi

Next Story