నిర్మల్‌ జిల్లా బాసరట్రిపుల్ ఐటీ విద్యార్ధులతో ఇంచార్జి వీసీ చర్చలు విఫలం

Basara IIIT: మెస్ కాంట్రాక్టర్‌లను వెంటనే రద్దు చేయాలని కోరిన విద్యార్థులు

Jyothi
Published on: 31 July 2022 7:45 AM IST
Basara IIIT Students Protest
X

నిర్మల్‌ జిల్లా బాసరట్రిపుల్ ఐటీ విద్యార్ధులతో ఇంచార్జి వీసీ చర్చలు విఫలం

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. మెస్‌లో సరైన ఆహారం పెట్టడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఉన్న మెస్‌ కాంట్రాక్టర్లను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. టెండర్లను ఇటీవలే ఖరారుచేశామని, వెంటనే కాంట్రాక్టును రద్దుచేయలేమని వైస్‌ఛాన్సలర్‌ చెబుతున్నారు. విద్యార్థులమాత్రం ఆందోళన కొనసాగించారు. వేకువజాముదాకా నిరసన దీక్షను కొనసాగించారు. విద్యార్థుల ఆందోళనకు మద్ధతు తెలిపేందుకు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ చేరుకునేందుకు ప్రయత్నించిన ముధోల్ బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టుచేశారు. విద్యార్థులను పరామర్శించేందుకు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు ట్రిపుల్ఐటీ క్యాంపస్ రానున్నట్లు సమాచారం.

Jyothi

Jyothi

Next Story