RGUKT Admissions : బాసర ఐఐఐటీలో డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం

RGUKT Admissions : బాసర ఐఐఐటీలో డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం
x
Highlights

RGUKT Admissions : పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్దులు భవిష్యత్తులో ఏం చదివితే బాగుంటుంది, ఏ కోర్సు చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ సతమతమవుతుంటారు....

RGUKT Admissions : పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్దులు భవిష్యత్తులో ఏం చదివితే బాగుంటుంది, ఏ కోర్సు చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ సతమతమవుతుంటారు. కొంత మంది విద్యార్ధులు ఇంటర్ చేయాలని అనుకుంటారు, మరికొంత మంది డిప్లమా వైపు వెళదాం అనుకుంటారు. అదే విధంగా కొంత మంది విద్యార్ధులు ఐఐఐటీలో చేరాలని అనుకుంటారు. అలాంటి విద్యార్ధులకు RGUKT శుభవార్త తెలిపింది. ఇప్పటికే ఎప్పుడో ప్రారంభం కావలసిన ఐఐఐటీ తరగతులు ఈ ఏడాది కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్-RGUKT 2020-21 విద్యా సంవత్సరానికి 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించింది. 10వ తరగతి పాసైన విద్యార్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేయొచ్చు.

RGUKTలో తెలంగాణ రాష్ట్ర విద్యార్ధులతో పాటు ఆంధ్రప్రదేశ్, ఇతర విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలు కూడా దీనికి అప్లై చేయొచ్చు. ఇటీవలే ప్రారంభం అయిన దరఖాస్తు ప్రక్రియ 2020 అక్టోబర్ 3న ముగుస్తుండగా, దివ్యాంగులు, సీఏపీ, ఎన్‌‌సీసీ, స్పోర్ట్స్ లాంటి స్పెషల్ కేటగిరీ విద్యార్థులు అక్టోబర్ 6 వరకు దరఖాస్తు చేయొచ్చు. ఇక పోతే RGUKTలో సీట్ల కేటాయింపు విషయానికొస్తే 15 శాతం సీట్లు ఇతర ప్రాంతాల వారికి, 85 శాతం సీట్లు స్థానికులకు అంటే తెలంగాణవాసులకు కేటాయించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. విద్యార్థులు టీఎస్ఆన్‌లైన్ సర్వీసెస్‌లో ఫీజు చెల్లించిన తర్వాత https://admissions.rgukt.ac.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలను https://www.rgukt.ac.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు

2020 సెప్టెంబర్ 16న దరఖాస్తు ప్రారంభం

2020 అక్టోబర్ 3న ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ

2020 అక్టోబర్ 6న స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ

విద్యార్హతలు

10వ తరగతిలో వచ్చిన జీపీఏ ద్వారా ఎంపిక

వయోపరిమితి

2020 డిసెంబర్ 31 నాటికి 18 ఏళ్ల లోపు ఉండాలి.

దరఖాస్తు రుసుము

ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.200,

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.150.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

The Convener,

Rajiv Gandhi University of Knowledge Technologies,

Basar, Nirmal District,

Telangana State-504107.

Show Full Article
Print Article
Next Story
More Stories