మందుబాబులకు శుభవార్త.. న్యూఇయర్‌ వేడుకలకు తెలంగాణలో ప్రత్యేక అనుమతులు

New Year Celebrations: తెలంగాణలో మందు బాబులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Arun Chilukuri
Published on: 28 Dec 2021 7:27 PM IST
Bars, Liquor Shops Timings Extended for New Year’s eve in Telangana
X

మందుబాబులకు శుభవార్త.. న్యూఇయర్‌ వేడుకలకు తెలంగాణలో ప్రత్యేక అనుమతులు

New Year Celebrations: తెలంగాణలో మందు బాబులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్‌ వేడుకలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. బార్లు, పబ్‌లు, స్పెషల్ ఈవెంట్స్‌కు అనుమతులు ఇచ్చింది. డిసెంబర్‌ 31న వైన్‌షాపులకు రాత్రి 12 గంటల వరకు, బార్లు, టూరిజం బార్లకు అర్ధరాత్రి ఒంటి గంట వరకు, ఈవెంట్స్‌కు రాత్రి ఒంటి గంట వరకు అనుమతులు ఇస్తూ జీవో జారీ చేసింది. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఈవెంట్ల నిర్వహణకు ఎక్సైజ్‌శాఖ తాత్కాలిక లైసెన్స్‌లు జారీ చేయనుంది. అయితే, ఈవెంట్లలో పాల్గొనేవారి సంఖ్యను బట్టి లైసెన్స్‌ఫీజు రూ.50వేల నుంచి 2.5లక్షలుగా ఎక్సైజ్‌శాఖ నిర్ణయించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story