Banjara Hills CI : బంజారాహిల్స్ సీఐ శివచంద్ర సస్పెండ్

Pudding and Mink Pub: బంజారాహిల్స్ ఫుడింగ్ మింక్ వ్యవహరంపై పోలీసు శాఖ సీరియస్ అయింది.

Arun Chilukuri
Published on: 3 April 2022 1:28 PM IST
Banjara Hills CI Siva Chandran Received Suspension
X

Banjara Hills CI : బంజారాహిల్స్ సీఐ శివచంద్ర సస్పెండ్

Pudding and Mink Pub: బంజారాహిల్స్ ఫుడింగ్ మింక్ వ్యవహరంపై పోలీసు శాఖ సీరియస్ అయింది. బంజారాహిల్స్ సీఐ శివ చంద్రను పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్‌కు పోలీసులు చార్జ్ మెమో ఇచ్చారు. ఈ పబ్ విషయమై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినందున పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకొన్నారు. పుడింగ్ మింక్ పబ్‌లో ఆరు గ్రాముల కొకైన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఆదివారం తెల్లవారుజాము వరకు పబ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం తెలుసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.

మింక్ పబ్‌ను నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్నారని పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఇవాళ తెల్లవారుజామున టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసిన సమయంలో కొకైన్ లభ్యమైంది. బాత్‌రూమ్ లు, డ్యాన్స్ ఫోర్లలో డ్రగ్స్ ను గుర్తించారు. ఇది కాకుండా ఆరు గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఇది కొకైన్ అని ల్యాబ్ నుండి పోలీసులకు కచ్చితమైన సమాచారం అందినట్లు తెలుస్తోంది. అయితే పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ తో పబ్ నిర్వహిస్తున్నా కూడా పోలీసులు పట్టీ పట్టనట్టుగా వ్యవహరించారని ఉన్నతాధికారులు సీఐపై చర్యలు తీసుకొన్నారు.

ఈ పబ్ లైసెన్స్ మాజీ ఎంపీ కూతురి పేరున ఉంది. అయితే ఆమె ఈ ఫబ్ ను ఈ ఏడాది జనవరి మాసంలోనే వేరొకరికి లీజుకు ఇచ్చినట్టుగా సమాచారం. ప్రముఖులను మాత్రమే ఈ పబ్ కి అనుమతిస్తారు. అయితే ఇవాళ పోలీసులు దాడులు నిర్వహించిన సమయంలో ప్రముఖులే ఎక్కువగా ఈ పబ్ లో పోలీసులకు చిక్కారు. పబ్ కి వచ్చిన వారిలో ఎవరెవరు డ్రగ్స్ తీసుకొన్నారు, అసలు డ్రగ్స్ ఎలా వచ్చాయనే విషయమై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story