Bandla Krishna Mohan Reddy: బీఆర్ఎస్ నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు

Bandla Krishna Mohan Reddy: బీఆర్ఎస్ నాయకులను రెచ్చగొట్టేలా మాట్లాడుతోంది

Shekhar G
Updated on: 21 Nov 2023 7:01 PM IST
Bandla Krishna Mohan Reddy Comments On Saritha
X

Bandla Krishna Mohan Reddy: బీఆర్ఎస్ నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు

Bandla Krishna Mohan Reddy: గద్వాల కాంగ్రెస్ అభ్యర్థి సరిత.. శాంతి భధ్రతలకు భంగం వాటిల్లే విధంగా వాఖ్యలు చేస్తూ... బీఆర్ఎస్ నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని గద్వాల బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆరోపించారు. గద్వాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి సరిత ప్రజలను, బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడటం సరైంది కాదని హితవు పలికారు. వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతున్న గద్వాలలో కాంగ్రెస్ అభ్యర్థి సరిత రెచ్చగొట్టేలా మాట్లాడటంపై ప్రజలు ఓసారి ఆలోచించాలన్నారు.

ఇలాంటి నాయకులను ఎన్నుకుంటే గద్వాల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జడ్పీ చైర్ పర్సన్‌గా ఉండి... జిల్లాను అభివృద్ది చేయకుండా.. రాజకీయ స్వార్ధం కోసం పార్టీ మారిన ఆమెకు... ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story