Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ

Bandi Sanjay Wrote Letter To Revanth Reddy
x

Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ

Highlights

Bandi Sanjay: గ్రామాల్లో సర్పంచులు చేసిన పనులను రికార్డు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలి

Bandi Sanjay: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీజేపీ నేత బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని లేఖలో బండి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు కావొస్తున్నా సర్పంచుల పెండింగ్ బిల్లులపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరం అన్నారు ఆయన.

అసెంబ్లీ ఎన్నికల్లో సర్పంచుల పెండింగ్ బిల్లులను అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చిన మీరు ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం శోచనీయం అన్నారు బండి సంజయ్. కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు కేటాయించిన నిధులను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దారిమళ్లించిందని సంజయ్ ఆరోపించారు. గ్రామాభివృద్ధికి సర్పంచులు చేసిన పనులను వెంటనే రికార్డు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని బండి సంజయ్‌ లేఖలో ప్రస్తావించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories