Bandi Sanjay: మోడీ సభకు రాష్ట్ర అధ్యక్షుని హోదాలో వస్తానో లేదో తేలియదన్న బండి సంజయ్

Bandi Sanjay Will Modi Come As The Speaker Of The House Or Not
x

Bandi Sanjay: మోడీ సభకు రాష్ట్ర అధ్యక్షుని హోదాలో వస్తానో లేదో తేలియదన్న బండి సంజయ్

Highlights

Bandi Sanjay: అధ్యక్షునిగా మీరే కొనసాగాలి అంటూ బండి కోరిన కార్యకర్తలు

Bandi Sanjay: తెలంగాణ బీజేపీలో అసలు ఏం జరుగుతోంది. రాష్ట్ర నాయకత్వంపై హైకమాండ్‌కు ఉన్న అభిప్రాయం ఏంటి..? తెలంగాణ బీజేపీలో మార్పులపై స్టేట్ చీఫ్ బండి సంజయ్‌కే సరైన సమాచారం లేదా..? మార్పులపై స్పష్టతలేకే బండి నారాజ్‌లో ఉన్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీ స్టే్ట్ చీఫ్‌ను మారుస్తారంటూ కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ కేంద్రంగా పలువురు రాష్ట్ర నేతలతో అధినాయకత్వం మంత్రాంగం నడిపింది. కాని ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. దీంతో రాష్ట్ర బీజేపీలో గందరగోళ పరిస్థితలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా స్టేట్ చీఫ్ బండి సంజయ్ సైలెట్ అయ్యారు. పార్టీలో జరిగే మార్పులపై ఎవ్వరూ స్పందించడం లేదు. ఒక్క జితేందర్ రెడ్డి మాత్రమే ట్వీట్‌లో రాజకీయ చర్చకు కేంద్ర బింధువుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మార్పులు చేర్పులపై తొలిసారి స్పందించారు. హనుమకొండలో ప్రధాని నరేంద్ర మోడీ సభకు జన సమీకరణపై నిన్న సాయంత్రం బీజేపీ నేతలు హనుమకొండలో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు.. రాష్ట్ర అధ్యక్షుడ్ని మారుస్తారనే ప్రచారం నడుస్తోంది.. ఇది నిజమేనా అని బండి సంజయ్‌ను అడిగారు.

ఈ విషయంపై బండి సంజయ్ స్పందించారు. మోదీ బహిరంగ సభకు కూడా రాష్ట్ర అధ్యక్షుని హోదాలో వస్తానో లేదో కూడా తెలియదని అన్నారు. బండి సంజయ్ వల్లే తెలంగాణలో బీజేపీ గ్రామస్థాయి వరకు విస్తరించిందని కార్యకర్తులు తెలిపారు. ఆయన పోరాడం వల్లే గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకుల అరాచకాలని ఎదుర్కొనగలుగుతున్నామని స్పష్టం చేశారు. అధ్యక్షునిగా మీరే కొనసాగాలి అంటూ పలువురు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. మీ కష్టం వృథా కాదని బండి సంజయ్‌కు భరోసా ఇచ్చారు. ఇక పార్టీ నిర్ణయమే తుది నిర్ణయమని.. ప్రధాని మోడీ పాల్గొనే సభను అందరూ విజయవంతం చేయాలని బండి సంజయ్ కార్యకర్తలకు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories