బండి సంజయ్ పాదయాత్రకు తాత్కాలిక విరామం

Bandi Sanjay: ఢిల్లీ వెళ్లిన బండి సంజయ్

Jyothi
Published on: 6 Aug 2022 6:36 AM IST
Bandi Sanjay Went to Delhi
X

బండి సంజయ్ పాదయాత్రకు తాత్కాలిక విరామం

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసే అవకాశం ఉంది. కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరిక, మునుగోడు ఉపఎన్నికపై జేపీ నడ్డాతో చర్చించనున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై పార్టీ జాతీయ నేతలకు వివరించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షా మునుగోడు రాజకీయాలపై నివేదికలు తెప్పించుకున్నారు. ఉపఎన్నిక కోసం కాయా పార్టీ యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తుంది.

Jyothi

Jyothi

Next Story