Etela Rajender: నియంత పాలన నుంచి ఈటల బయటకు వచ్చారు- బండి సంజయ్

Etela Rajender: నియంత పాలన నుంచి ఈటల రాజేందర్ బయటకు వచ్చారన్నారు తెలంగాణ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్.

Arun Chilukuri
Published on: 14 Jun 2021 2:50 PM IST
Bandi Sanjay Welcomes Etela Rajender to BJP
X

Etela Rajender: నియంత పాలన నుంచి ఈటల బయటకు వచ్చారు- బండి సంజయ్



Etela Rajender: నియంత పాలన నుంచి ఈటల రాజేందర్ బయటకు వచ్చారన్నారు తెలంగాణ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ ఉద్యమంలో ఈటల కీలక పాత్ర పోషించారని చెప్పారు. తెలంగాణ రాష్ర్ట పార్టీ తరపున ఈటలకు స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం బీజేపీకి మాత్రమే ఉందన్నారు. రాష్ర్టంలోని ఉద్యమకారులకు బీజేపీ వేదిక అవుతుందని ప్రజాస్వామ్య తెలంగాణ దిశగా పని చేస్తామన్నారు బండి సంజయ్.

ఈటలతో పాటు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి , మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, తెలంగాణ ఆర్టీసీ నేత అశ్వద్ధామ రెడ్డి బీజేపీలో చేరారు. అదేవిధంగా ఈటల రాజేంద్రర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తామని అన్నారు. బీజేపీ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా శ్రమిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో బీజేపీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని ఈటల వెల్లడించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story