జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లిని దర్శించుకున్న బండి సంజయ్

Bandi Sanjay: అమ్మవారి ఆలయం నిర్మించిన స్వర్గీయ పీజేఆర్‌కు ధన్యవాదాలు

Rama Rao
Published on: 15 May 2022 12:58 PM IST
Bandi Sanjay visiting Jubilee Hills Peddamma Talli Temple | Live News
X

జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని దర్శించుకున్న బండి సంజయ్

Bandi Sanjay: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లిని టీబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో బండి సంజయ్ ఖమ్మం బయల్దేరి వెళ్లనున్నారు. గత నెలలో హత్యకు గురైన సాయిగణేష్‌ కుటుంబాన్ని బండి సంజయ్ పరామర్శించనున్నారు.

అమిత్‌షా టూర్‌తో కార్యకర్తల్లో కొత్త జోష్ వచ్చిందన్నారు టీ.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ రైతులను మానసిక క్షోభకకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లిని దర్శించుకున్న బండి సంజయ్ కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకుంటామని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే బాయిల్డ్‌ రైస్‌ మొత్తం కొంటామన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లు పగటి వేషగాళ్లని మండిపడ్డారు. ఆకుపచ్చని తెలంగాణ బీజేపీ లక్ష్యమన్నారు.

Rama Rao

Rama Rao

Next Story