సామ రంగారెడ్డిని పరామర్శించిన బండి సంజయ్

Bandi Sanjay: ఈనెల 22న జరిగిన ఘర్షణలో గాయపడ్డ సామ రంగారెడ్డి

Jyothi
Published on: 29 Aug 2022 1:09 PM IST
Bandi Sanjay Visited Sama Ranga Reddy
X

సామ రంగారెడ్డిని పరామర్శించిన బండి సంజయ్

Bandi Sanjay: బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డిని టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ పరామర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నెల 22న టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలో సామ రంగారెడ్డికి గాయాలయ్యాయి. పెద్ద అంబర్‌పేటలోని తన నివాసంలో సామ రంగారెడ్డిని బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ పరామర్శించారు. సీఎం కేసీఆర్‌ కుటుంబంపై వస్తున్న అవినీతి, ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకే టీఆర్‌ఎస్, ఎంఐఎంల గుండాలు.. పోలీసుల సమక్షంలో బీజేపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డారని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతి, అక్రమాలు బయటకు వస్తుండడంతో వాటి నుంచి దృష్టి మళ్లించేందుకే దాడులు, మత ఘర్షణలు జరిగేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

Jyothi

Jyothi

Next Story