ఇబ్రహీంపట్నం బాధితులను పరామర్శించిన బండి సంజయ్‌

Bandi Sanjay: జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన బండి సంజయ్‌

Jyothi
Published on: 31 Aug 2022 1:44 PM IST
Bandi Sanjay Visited Ibrahimpatnam Victims
X

ఇబ్రహీంపట్నం బాధితులను పరామర్శించిన బండి సంజయ్‌

Bandi Sanjay: ఇబ్రహీంపట్నం బాధితులను టీబీజేపీ చీఫ్ బండి సంజయ్‌ పరామర్శించారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన బండి సంజయ్‌.. ఆపరేషన్‌ వికటించి నలుగురు మృతి చెందడంపై ఆరా తీశారు. గంటలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ ఎందుకు చేశారని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్‌కు పేరు ప్రఖ్యాతలు తప్ప.. పేదల ప్రాణాలు ముఖ్యం కాదని సంజయ్‌ ఆరోపించారు. మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకోవాలంటే భయపడుతున్నారని తెలిపారు.

బాధిత కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. ఒక్కో బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలన్నారు. సంబంధిత శాఖ మంత్రి ఎక్కడున్నారు? ఆయన్ను వెంటనే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్ చేశారు. బర్తరఫ్‌ చేసే దమ్ము కేసీఆర్‌కు ఉందా అని నిలదీశారు. ఆ మంత్రి కుటుంబ సభ్యుడు కాకుంటే వెంటనే బర్తరఫ్‌ చేసేవారని బండి సంజయ్‌ అన్నారు.

Jyothi

Jyothi

Next Story