ఇవాళ బండి సంజయ్‌ అధ్యక్షతన బీజేపీ కీలక సమావేశాలు

* రానున్న ఎన్నికలకు కార్యాచరణ రూపొందించనున్న కమలం పార్టీ

R Tripura Malini
Published on: 16 Dec 2022 9:45 AM IST
Bandi Sanjay To lead Todays Important Meet
X

ఇవాళ బండి సంజయ్‌ అధ్యక్షతన బీజేపీ కీలక సమావేశాలు

Bandi Sanjay: ఇవాళ హైదరాబాద్‌ బీజేపీ ఆఫీస్‌లో బండి సంజయ్‌ అధ్యక్షతన కీలక సమావేశాలు జరగనున్నాయి. కాసేపట్లో బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు స్టేట్‌ ఆఫీస్‌ బేరర్స్‌ మీటింగ్‌ జరగనుంది. రానున్న అసెంబ్లీ ఎన్నిలకు కార్యాచరణ రూపొందించనుంది కమలం పార్టీ. ఒకవేళ కేసీఆర్‌ ముందస్తుకు వెళ్తే ఎలా ఎదుర్కోవాలనేదానిపై నేతలు చర్చించనున్నారు. అలాగే ప్రజా సంగ్రామ యాత్ర, ప్రజాగోస-బీజేపీ భరోసా కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు. పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజన కార్యక్రమం, కేంద్రమంత్రుల పర్యటనపై చర్చ జరగనుంది. త్వరలో హైదరాబాద్‌ సిటీలో బండి సంజయ్‌ పాదయాత్రపై రూట్‌మ్యాప్‌ రూపొందించనుంది కమలం పార్టీ.

R Tripura Malini

R Tripura Malini

Next Story