బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు.. క్యాసినో సహా అన్ని దందాల్లో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు

Bandi Sanjay: చిట్‌చాట్‌లో టీబీజేపీ చీఫ్‌ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 30 July 2022 7:23 PM IST
Bandi Sanjay Slams TRS Leaders
X

బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు.. క్యాసినో సహా అన్ని దందాల్లో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు

Bandi Sanjay: చిట్‌చాట్‌లో టీబీజేపీ చీఫ్‌ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నిక రావాలని టీఆర్‌ఎస్ కోరుకుంటుందని ఉపఎన్నిక రాకూడదని కాంగ్రెస్‌ కోరుకుంటున్నట్లు చెప్పారు బండి సంజయ్. కాగా మునుగోడు ఉపఎన్నికపై ప్రజల అభిప్రాయమే బీజేపీ అభిప్రాయమన్న బండి సంజయ్ పాతబస్తీపై అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు.

గోషామహల్‌తోపాటు నాంపల్లి, యాకత్‌పురాలో గెలుస్తామని చెప్పారు. ఇక రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్‌ 15 అసెంబ్లీ స్థానాలకే పరిమితం అవుతుందని బండి సంజయ్ జోస్యం చెప్పారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై త్వరలో ఢిల్లీకి టీబీజేపీ బృందం వెళ్తుందన్నారు బండి సంజయ్. ఇక క్యాసినో సహా అన్ని దందాల్లో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story