కాంగ్రెస్‌కు చెందిన పీవీ బొమ్మ పెట్టుకుని టీఆర్‌ఎస్‌ గెలవాలని చూస్తోంది: బండి సంజయ్‌

Arun Chilukuri
Published on: 6 March 2021 4:58 PM IST
Bandi Sanjay Slams TRS Leaders
X

కాంగ్రెస్‌కు చెందిన పీవీ బొమ్మ పెట్టుకుని టీఆర్‌ఎస్‌ గెలవాలని చూస్తోంది: బండి సంజయ్‌

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు చెందిన పీవీ బొమ్మ పెట్టుకొని టీఆర్ఎస్‌ గెలవాలని చూస్తోందని విమర్శించారు. అడ్డదారిలో గెలిచేందుకు టీఆర్ఎస్‌ నేతలు ఉద్యోగులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ నేతల అహంకారాన్ని తగ్గించడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సూచించారు. అనంతరం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story