Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డి,కేసీఆర్ మాటల యుద్దంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్ మాటల యుద్ధంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు.

Arun Chilukuri
Published on: 26 Dec 2025 5:42 PM IST
Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డి,కేసీఆర్ మాటల యుద్దంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్
X

Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డి,కేసీఆర్ మాటల యుద్దంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్ మాటల యుద్ధంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాజకీయాల్లో అభివృద్ధి మాట వినిపించడం లేదని.. మండిపడ్డారు. సీఎం అధికారంలో ఉన్నవారు.. అధికారం కోసం ఆరాటపడేవారు అసభ్య పదజాలంతో దూషించుకుంటున్నారని విమర్శించారు. నాయకులు తిట్టుకుంటుంన్నారంటే.. పాలనలో వారు విఫలమైనట్టేనన్నారు.

సంస్కారం గురించి క్లాసులు చెప్పే పార్టీలు.. రాజ్యాంగబద్ద పదవుల్లో ఉండి అసభ్యంగా మాట్లాడుతున్నాయని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కంటే.. ప్రతిపక్షాల మధ్య తిట్ల పురాణమే ఎక్కువగా వినిపిస్తోందన్నారు. అభివృద్ధిపై చర్చను పక్కనపెట్టి గొడవలతో కాలక్షేపం చేయటం దురదృష్టకరమన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story