Telangana: శ్రీకాంతాచారికి దొరికిన అగ్గిపెట్టె.. హరీష్‌‌‌కు ఎందుకు దొరకలేదో?- బండి సంజయ్

Telangana: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 26 March 2021 7:13 PM IST
Bandi Sanjay slams Harish Rao
X

Telangana: శ్రీకాంతాచారికి దొరికిన అగ్గిపెట్టె.. హరీష్‌‌‌కు ఎందుకు దొరకలేదో?- బండి సంజయ్

Telangana: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ చేసిన బండి సంజయ్‌ శాసనసభలో మంత్రి హరీష్‌రావు చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. హరీష్‌రావు అగ్గిపెట్టె కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నాడంటూ బండి సంజయ్‌ సెటైర్లు వేశారు. తెలంగాణ ఉద్యమంలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న హరీష్‌‌కు అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదో కచ్చితంగా సీబీఐ విచారణ జరిపించాల్సిందేనంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

శ్రీకాంతాచారికి దొరికిన అగ్గిపెట్టె హరీష్‌‌‌కు ఎందుకు దొరకలేదో? కచ్చితంగా ప్రజలకు తెలియాల్సిందేన్నారు. హరీష్‌రావు అంటేనే అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ అంటూ బండి సంజయ్ ఆరోపించారు. దుబ్బాకలో అబద్ధాలు చెప్పినందుకే ప్రజలు హరీష్ వీపు సాఫ్ చేశారని గుర్తుచేశారు. ఇక, సీనియర్ లీడర్‌నంటూ చెప్పుకునే హరీష్‌కరావుకి శాసనసభలో లేని వ్యక్తిపై విమర్శలు చేయకూడదనే సంగతి తెలియదా అంటూ ప్రశ్నించారు.

శాసనసభ వేదికగా నిన్న బండి సంజయ్‌పై హరీష్‌రావు ఘాటు వ్యా‌ఖ‌్యలు చేశారు. రాష్ట్ర హక్కులను కాలరాస్తూ బండి సంజయ్ క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మాట్లాడితే దేశ భక్తి అంటూ మాట్లాడే బండి సంజయ్‌కు స్వరాష్ట్ర భక్తి ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.

పనిలో పనిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్‌ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందన్నారు. ఇక, కేసీఆర్ పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించిన అంశాన్ని వదలబోనన్నారు. త్వరలో సీఎం కేసీఆర్‌పై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తా‌నన్న బండి సంజయ్‌ ఏ విషయంలో పార్లమెంట్‌ను కేసీఆర్ ఏం తప్పుదోవ పట్టించారో బయటికి వచ్చాక సంచలనం అవుతుందంటూ సస్పెన్స్‌ క్రియేట్ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story