Bandi Sanjay: రైతుల అరెస్టులపై బండి సంజయ్ నిప్పులు: 'నీళ్లివ్వమంటే జైల్లో పెడతారా?'

Bandi Sanjay: రైతుల అరెస్టులపై బండి సంజయ్ నిప్పులు: 'నీళ్లివ్వమంటే జైల్లో పెడతారా?'
Bandi Sanjay: ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న రైతులను అరెస్ట్ చేయడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bandi Sanjay: ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న రైతులను అరెస్ట్ చేయడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి కోసం పోరాడుతున్న రైతులపై ఉక్కుపాదం మోపడం అన్యాయమని ఆయన మండిపడ్డారు.
కెనాల్ పనులపై నిలదీత:
రంగనాయక సాగర్ నుండి పెద్దలింగాపూర్, తంగళ్లపల్లి మండలాలకు సాగునీరు అందించే కెనాల్ పనులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయని బండి సంజయ్ ప్రశ్నించారు. "రూ.3 కోట్ల నిధులు విడుదలయ్యాయని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించి ఏడాది దాటినా పనులు ఎందుకు ప్రారంభించలేదు? ఈ కాలువ పనులు పూర్తి చేసి ఉంటే 9,500 ఎకరాలకు సాగునీరు అందేది కదా?" అని ఆయన నిలదీశారు.
కేటీఆర్ ఒక రైతు ద్రోహి:
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బండి సంజయ్ విమర్శనాస్త్రాలు సంధించారు. అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో రంగనాయక సాగర్ ద్వారా సిరిసిల్ల జిల్లాకు నీరివ్వని కేటీఆర్ పక్కా 'రైతు ద్రోహి' అని ధ్వజమెత్తారు. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పాలకుల వైఫల్యాల వల్ల వరుసగా పంటలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ నేతల అరెస్ట్ అక్రమం:
న్యాయం చేయాలని అడిగిన రైతులకు సంఘీభావం తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపీతో పాటు ఇతర పార్టీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది ముమ్మాటికీ అక్రమ అరెస్ట్ అని పేర్కొన్నారు.
బండి సంజయ్ డిమాండ్లు:
అరెస్ట్ చేసిన రైతులను, బీజేపీ నాయకులను బేషరతుగా వెంటనే విడుదల చేయాలి.
రైతులపై అక్రమంగా కేసులు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
రంగనాయక సాగర్ 11వ ప్యాకేజీ నుండి ఎల్ఎం 4, ఎల్ఎం 6 కాలువ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.
తక్షణమే పనులు ప్రారంభించకపోతే ఆయా ప్రాంతాల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



