Bandi Sanjay: ఆయనేం తప్పు చేశారు.. భావోద్వేగానికి లోనైన బండి సంజయ్‌..

Bandi Sanjay: ధర్మ రక్షణలో కాషాయ పోరాడుతున్న ప్రచారకుల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

Arun Chilukuri
Published on: 22 Nov 2022 7:30 PM IST
Bandi Sanjay Slams CM KCR
X

Bandi Sanjay: ఆయనేం తప్పు చేశారు.. భావోద్వేగానికి లోనైన బండి సంజయ్‌..

Bandi Sanjay: ధర్మ రక్షణలో కాషాయ పోరాడుతున్న ప్రచారకుల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. శామీర్ పేటలో నిర్వహించిన బీజేపీ శిక్షణా తరగతులలో చివరి రోజు బండి సంజయ్ భావోద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్ తాను చేసిన తప్పులను సవరించుకునేందుకు ఫామ్ హౌజ్, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు లింకులు పెడుతూ తమ ప్రచారకులను వేధిస్తున్నారని మండిపడ్డారు. బీఎల్ సంతోష్ ఏం తప్పు చేశాడని నోటీసులిచ్చారని ప్రశ్నించారు. కేసులు, నోటీసులకు భయపడే ప్రసక్తే లేదన్న బండి.. బీజేపీ లక్ష్యంగా సీఎం కేసీఆర్ కుట్రలను కార్యకర్తలు గమనించి ప్రజాపోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story