Bandi Sanjay: ఎంపీ అర్వింద్‌పై హత్యా ప్రయత్నం జరిగింది.. కేసీఆర్‌కు నూకలు చెల్లాయి..

Bandi Sanjay: ఎంపీ అర్వింద్‌ను హత్య చేసేందుకే టీఆర్ఎస్ ప్రయత్నించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు.

Arun Chilukuri
Updated on: 27 Jan 2022 8:31 PM IST
Bandi Sanjay Slams CM KCR
X

Bandi Sanjay: ఎంపీ అర్వింద్‌పై హత్యా ప్రయత్నం జరిగింది.. కేసీఆర్‌కు నూకలు చెల్లాయి..

Bandi Sanjay: ఎంపీ అర్వింద్‌ను హత్య చేసేందుకే టీఆర్ఎస్ ప్రయత్నించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు. తెలంగాణలో ఎంపీలకే రక్షణ లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు నూకలు చెల్లాయని..ఓటమి భయం కూడా పట్టుకుందని ఆరోపించారు. తమ సహనాన్ని పిరికితనంగా భావించొద్దన్నారు. ప్రజల కోసం తాము చావడానికైనా సిద్ధమని బండి సంజయ్ అన్నారు.

ఎంపీ ధర్మపురి అర్వింద్ పర్యటనలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. నిజామాబాద్ జిల్లా నందిపేటలో రమేష్, నరేందర్ ఇద్దరు బీజేపీ కార్యకర్తలు గాయపడగా ఎంపీ అర్వింద్, సోయం బాపూరావు, ఎమ్మెల్యే రఘునందన్‌రావులతో కలిసి కార్యకర్తలను పరామర్శించారు. ఎవరు అధైర్యపడొద్దని బీజేపీ కార్యకర్తలను అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story