Bandi Sanjay: తెలంగాణలో రాబోయేది మోడీ ప్రభుత్వమే

Bandi Sanjay: తెలంగాణలో రాబోయేది మోడీ ప్రభుత్వమేనన్నారు ఎంపీ బండి సంజయ్.

Arun Chilukuri
Published on: 10 Oct 2023 4:31 PM IST
Bandi Sanjay Slams BRS Govt in BJP Jana Garjana Sabha At Adilabad
X

Bandi Sanjay: తెలంగాణలో రాబోయేది మోడీ ప్రభుత్వమే

Bandi Sanjay: తెలంగాణలో రాబోయేది మోడీ ప్రభుత్వమేనన్నారు ఎంపీ బండి సంజయ్. ఆదిలాబాద్‌లో బీజేపీ నిర్వహించిన జనగర్జన సభలో అధికార బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు బండి సంజయ్. తెలంగాణలో మోడీ రాజ్యానికి ఎవరూ అడ్డురాలేరని వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్. గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. గిరిజనులకు పోడు పట్టాలు, 12 శాతం రిజర్వేషన్లు ఇస్తే బీఆర్‌ఎస్‌కే ఓటేయాలని అన్నారు. TSPSC పేపర్ లీక్‌లో 30 లక్షల మంది అభ్యర్థుల జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు. 5 లక్షల కోట్లు అప్పు చేసిన రాష్ట్ర ప్రజల బతుకులను బర్బాత్ చేశారని ఆరోపించారు బండి సంజయ్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story