Telangana: డ్రగ్స్‌ కేసులో నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలున్నారు -బండి సంజయ్

Telangana: సీఎం కేసీఆర్‌పై టీబీజేపీ చీఫ్‌ బండి సంజయ్ హాట్‌ కామెంట్స్‌ చేశారు. రాష్ట్రంలో కొత్తగా డ్రగ్స్‌ దందాకు తెరలేపారన్నారు‌

Samba Siva Rao
Published on: 4 April 2021 6:18 PM IST
Bandi Sanjay Comments On Cm KCR
X

బండి సంజయ్ న్యూ ఫైల్ ఫోటో

Telangana: సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు టీబీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. రాష్ట్రంలో కొత్తగా డ్రగ్స్ దందా మొదలైందని అన్నారు. డ్రగ్స్ పార్టీల్లో పాల్గొన్నదెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరికీ కరోనా పరీక్షలు మానేసి, రక్త పరీక్షలు చేయించాలని సూచించారు.

బెంగళూరు డ్రగ్స్‌ కేసులో నలుగురు ఎమ్మెల్యేలను కాపాడే ప్రయత్నాలు సీఎం చేస్తున్నారని ఆరోపించారు సంజయ్‌. సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు బండి సంజయ్‌. దమ్ముంటే కేసీఆర్‌ దగ్గరనుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలంతా రక్త పరీక్షలు చేయించుకోవాలని, తామంతా కూడా పరీక్షలకు సిద్ధమేనని ఛాలెంజ్‌ విసిరారు. దీనికి సీఎం కేసీఆర్ సిద్ధమేనా అని ప్రశ్నించారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story