సారు.. కారు.. సర్కారు.. ఇక రారు: బండి సంజయ్

Arun Chilukuri
Published on: 18 Nov 2020 4:59 PM IST
సారు.. కారు.. సర్కారు.. ఇక రారు: బండి సంజయ్
X

దుబ్బాక స్ఫూర్తితో గ్రేటర్ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చూపించాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఎంఐఎం పార్టీతో అధికార పార్టీ కుమ్మక్కైందని బండి సంజయ్ ఆరోపించారు. దుబ్బాకలో కారు వణికిందని, ఇక హైదరాబాద్‌లో కారును షెడ్డుకు పంపించాలని ఎద్దెవా చేశారు. సారు.. కారు.. సర్కారు. ఇకరారు అని బండిసంజయ్ చమత్కరించారు. హైదరాబాద్‌లో ఏం జరుగుతుందో దేశం మొత్తం చూస్తోందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో తయారి, రూపకల్పన, సమస్యలు, సలహాలు, సూచనల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాల్‌సెంటర్‌కు వచ్చే సూచనలను మేనిఫెస్టోలో పొందుపరుస్తామని బండి సంజయ్‌ వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story