మేయర్ ఎన్నికపై బండి సంజయ్ సంచలన కామెంట్స్
* టీఆర్ఎస్, మజ్లిస్ మధ్య అక్రమ సంబంధం మరోసారి రుజువైంది * టీఆర్ఎస్-మజ్లిస్ రెండు పార్టీలు చీకట్లో ప్రేమించుకుంటు.. * బయటకు వేర్వేరు అని చెప్పే ప్రయత్నం చేశాయి: బండి సంజయ్
Bandi Sanjay (file image)
మేయర్ ఎన్నికపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్, మజ్లిస్ మధ్య అక్రమ సంబంధం మరోసారి బహిర్గతమైందన్నారు. GHMC ఎన్నికల్లో బీజేపీ ఇదే అంశాన్ని చెప్పిందన్న బండి టీఆర్ఎస్-మజ్లిస్ రెండు పార్టీలు చీకట్లో ప్రేమించుకుంటు బయటకు వేర్వేరు అని చెప్పే ప్రయత్నం చేశాయని మండి పడ్డారు. టీఆర్ఎస్ పక్కా మతత్వ పార్టీ అయిన ఎంఐఎం చెంచా అని ఈరోజు రుజువైందని వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉండటం ఖాయమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Next Story




