Bandi Sanjay: బండి సంజయ్ సంచన కామెంట్స్
Bandi Sanjay: ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం: బండి సంజయ్
బండి సంజయ్ (ఫైల్ ఇమేజ్)
Bandi Sanjay: సీఎం కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం అంటూ మరోసారి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా చిట్‌చాట్ నిర్వహించిన బండి సంజయ్.. శుక్రవారం టీఆర్ఎస్ మంత్రుల కబ్జాలపై ఆధారాలతో సహా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయనున్నట్లు తెలిపారు. అలాగే.. ఈటలతో టచ్‌లో ఉన్నారన్న వార్తల్లో నిజం లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌పై ఉన్న కేసులు బయటకు తీస్తున్నది వాస్తవమే అని తెలిపిన బండి సంజయ్.. సహారా ఇండియా కేసుపై త్వరలో ఢిల్లీ వెళతా అనీ, కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం అని వ్యాఖ్యానించారు. మరోవైపు.. మాజీ మంత్రి బీజేపీ నేత పెద్దిరెడ్డి టీఆర్ఎస్‌లోకి వెళుతున్నారన్నది కూడా నిజం కాదన్నారు బండి సంజయ్.
Next Story




