బండి సంజయ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు.. 30మంది టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు..

Arun Chilukuri
Published on: 1 Jan 2021 12:54 PM IST
బండి సంజయ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు.. 30మంది టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు..
X

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమతో 30మంది టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని అన్నారు. పైగా టీఆర్ఎస్‌ కార్పొరేటర్లు కూడా బీజేపీలో చేరనున్నారని వెల్లడించారు. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డిని త్వరలో కలుస్తామన్నారు. రాజ్‌గోపాల్‌రెడ్డి బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. బీజేపీకి లైన్‌ క్లియర్‌ అయ్యిందని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story