Bandi Sanjay: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదు

Bandi Sanjay: బీఆర్ఎస్ పార్టీకి మూడో స్థానం మాత్రమే దక్కుతుంది

Jyothi
Published on: 26 Feb 2024 2:28 PM IST
Bandi Sanjay Says There will be no Alliance with BRS in Parliament Elections
X

Bandi Sanjay: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదు

Bandi Sanjay: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని బీజేపీ సీనియర్ నేత, కరీంగనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. రానున్న అయిదారు రోజుల్లో పార్లమెంట్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల అవుతుందన్నారాయన.. బీఆర్ఎస్‌తో తమకు ఒకవేళ పొత్తు ఉంటే.. ఇప్పటికే చర్చలు జరగాలి కదా అని సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ - బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని, బీఆర్ఎస్ పార్టీకి మూడో స్థానం మాత్రమే దక్కుతుందని జోస్యం చెప్పారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో సీబీఐ తన పని తాను చేస్తోందన్నారు. దర్యాప్తు సంస్థల విషయంలో బీజేపీ ఎప్పడు కలగచేసుకోలేదని చెప్పారాయన.

Jyothi

Jyothi

Next Story