Bandi Sanjay: టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలవబోతోంది ‌

Bandi Sanjay: హిందువులపై టీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష సాధిస్తోంది: బండి సంజయ్‌

Samba Siva Rao
Updated on: 14 March 2021 7:00 PM IST
Bandi Sanjay Comments On TRS
X

బండి సంజయ్ (thehansindia)

Bandi Sanjay: తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అడ్డదారిలో గెలిచేందుకు ప్రయత్నించిందన్న బండి సంజయ్.. అధికార పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా విజయం మాత్రం బీజేపీదే అన్నారు. తెలంగాణ పాలిటిక్స్‌లో జనసేనాని వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న రోజే టీఆర్ఎస్ అభ్యర్థికి సవన్ మద్దతు తెలపడం చర్చనీయాంశమైంది. ఈ మొత్తం ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏదైనా ఇబ్బంది ఉంటే కలసి చర్చించాలి కానీ ఇలా టీఆర్ఎస్‌కు మద్దతు తెలపడం బాధ కలిగించిందన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వానికి బండి సంజయ్ డెడ్ లైన్ విధించారు. భైంసా అల్లర్లలో అరెస్టు చేసిన బీజేపీ కార్యకర్తలను రేపు ఉదయం 8 గంటల లోగా విడుదల చేయాలన్నారు. లేదంటే అనంతరం జరిగే పరిణామాలకు టీఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యత అంటూ బండి సంజయ్ హెచ్చరించారు. చిన్నారిపై రేప్ జరిగితే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించిన బండి సంజయ్.. హిందువులపై టీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష సాధిస్తుందని మండి పడ్డారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story