దుబ్బాక గెలుపును స్ఫూర్తిగా తీసుకుంటాం : బండి సంజయ్

దుబ్బాక గెలుపును స్ఫూర్తిగా తీసుకుంటాం : బండి సంజయ్
x
Highlights

దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు..తెలంగాణలో ఇకపై బీజేపీ విజయ పరంపర కొనసాగుతుందన్నారు. టీఆర్ఎస్‌ నియంతృత్వ ధోరణిని అంతం చేస్తామన్నారు.

దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు..తెలంగాణలో ఇకపై బీజేపీ విజయ పరంపర కొనసాగుతుందన్నారు. టీఆర్ఎస్‌ నియంతృత్వ ధోరణిని అంతం చేస్తామన్నారు. దుబ్బాక ప్రజలు వాస్తవం గ్రహించారని.. ఇవాళ్టి తీర్పు బీజేపీ చేపట్టిన మలిదశ ఉద్యమానికి మరింత స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఈ విజయాన్ని అమరవీరులకి, పార్టీ కార్యకర్తలకు అంకితం ఇస్తున్నట్లుగా తెలిపారు. ఇదే ఉత్సాహంతో తాము GHMC ఎన్నికల్లో పనిచేస్తామని అన్నారు.. అంతేకాకుండా 2023లో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు బండి సంజయ్.

ఇక అటు సంచలన విజయం సాధించి బీజేపీ మొదటిసారి దుబ్బాకలో విజయకేతనం ఎగురవేసింది. 14వందల ఓట్లకు పైగా తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత మీద బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. మొత్తం 23 రౌండ్లలలో సాగిన లెక్కింపులలో రఘునందన్ రావు కు 62,772 ఓట్లు రాగా, సోలిపేట సుజాతకి 61,302 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 21,819 ఓట్లు వచ్చాయి.. ఓట్ల శాతంగా చూసుకుంటే.. బీజేపీకి 39%, టీఆర్ఎస్ కి 37% ఓట్లు వచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories