Bandi Sanjay: బలగం సినిమాని గుర్తుచేసిన బండి.. నేను లేకపోతే పక్షి ముట్టలేదు..

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ జైలు నుంచి విడుదలయ్యారు.

Arun Chilukuri
Published on: 7 April 2023 12:14 PM IST
Bandi Sanjay Recalls Balagam Movie
X

Bandi Sanjay: బలగం సినిమాని గుర్తుచేసిన బండి.. నేను లేకపోతే పక్షి ముట్టలేదు..

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ సర్కార్‌, కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పదోతరగతి పేపర్ లీక్ చేశానని చెప్పి అంటున్నారు, హిందీ పేపర్ ఎవరైనా లీక్ చేస్తారా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. హిందీ పేపర్ లీక్ చేశానని అంటున్నారు కదా.. మరి తెలుగు పేపర్ ఎవరు లీక్ చేశారని ప్రశ్నించారు. సీపీ రంగనాథ్ చెప్పినవన్నీ నిజాలైతే పోలీసు టోపీ మీద ఉన్న మూడు సింహాలపై ప్రమాణం చేయాలని అన్నారు.

పోలీసు వ్యవస్థను అవమానపరిచారని మండిపడ్డారు. వాట్సాప్‌లో ఎవరో పేపర్‌ షేర్‌ చేస్తే నాకేంటి సంబంధం అని ప్రశ్నించారు. మాల్ ప్రాక్టీస్ అంటే ఏంటో కూడా తెలియని సీపీ ఆయన అంటూ ఎద్దేవా చేశారు. మా అత్త చనిపోయిన సమయంలో ఇదా పరిస్థితి..? నన్ను కన్నకొడుకులా చూసింది. నేను లేకపోతే పక్షి ముట్టలేదు. ఇంట్లో అంతా విషాదంలో ఉన్నారు. ఓ పార్లమెంటేరియన్‌తో వ్యవహరించే శైలి ఇదా..? అంటూ పోలీసుల తీరుపై సంజయ్ ఆవేదన వ్యక్తంచేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story